
హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో శాశ్వత ప్రాతిపదికన జీపీఎఫ్ ఖాతాలను ప్రారంభించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే జడ్పీ జీపీఎఫ్ ఖాతాలు కొన సాగుతున్నాయని వారు చెప్పారు.
మంగళవారం పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను పీఆర్టీయూ నేతలు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జీపీఎఫ్ ఖాతా లు ఓపెన్ ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సుల్తానియా సానుకూలంగా పీఆర్టీయూ నేతలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.