​నిజామాబాద్‌లో దేశభక్తి చాటేలా తిరంగా ర్యాలీ 

​నిజామాబాద్‌లో దేశభక్తి చాటేలా తిరంగా ర్యాలీ 

నిజామాబాద్, వెలుగు : ఆపరేషన్​సిందూర్ తో పాక్​ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికుల ధైర్యాన్ని  కీర్తిస్తూ  సోమవారం నగరంలో తిరంగా ర్యాలీ జరిగింది. సిటిజన్స్​ ఫర్​ నేషనల్ సెక్యూరిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీ సహా యువజన సంఘాలు, పౌరులు పొల్గొన్నారు.  ఆర్​ఆర్​చౌరస్తా నుంచి గాంధీ చౌక్​ వరకు కొనసాగిన ర్యాలీలో జాతీయ జెండాను పట్టుకొని భారత్​మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. యాభై అడుగుల జాతీయ జెండా, భారతమాత వేషధారణలో బాలికలు ర్యాలీలో పాల్గొన్నారు. సైనికులను స్మరిస్తూ చేసిన కోలాటం ఆకర్షణగా నిలిచింది. 

పాక్​ మూలాలున్న వారిపై నిఘా..

పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులపై నిఘా పెట్టి, వారి కదలికలను గమనించాలని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.   గాంధీచౌక్ వద్ద ఆయన ర్యాలీనుద్దేశించి మాట్లాడారు. పాక్​తో సంబంధాలున్న వ్యక్తులు నగరం, దేశం వీడివెళ్లిపోవాలన్నారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​​కులాచారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, సిటిజన్స్​ ఫర్​ నేషనల్​ సెక్యూరిటీ కన్వీనర్​ కృపాకర్​రెడ్డి తదితరులు ఉన్నారు.  .

 కామారెడ్డిలో...

కామారెడ్డి​​, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు .  ఇటీవల ఆపరేషన్ సిందూర్​లో సైనికులు చూపిన వీరత్వం, వారి  త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ  త్రివర్ణ పతాకాలతో యాత్ర నిర్వహించారు.  జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్​ నుంచి మొదలైన యాత్ర  జేపీఎన్​ చౌరస్తా, సుభాష్​రోడ్డు, స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు,  హైస్కూల్ రోడ్డు మీదుగా నిజాంసాగర్​ చౌరస్తా వరకు సాగింది.

 యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు, స్టేట్​ లీడర్​ మురళీధర్​గౌడ్​, పార్టీ లీడర్లు, కార్యకర్తలు,  ఆర్ఎస్ఎస్, భజరంగ్​దళ్, వీహెచ్​పీతో పాటు ఆయా వర్గాల ప్రతినిధులు,  ప్రజలు పాల్గొన్నారు.