హైదరాబాద్ సిటీ, వెలుగు: అరవింద్ ఏవీ రచించిన ‘90స్ కిడ్ మ్యూజింగ్స్’ పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని లమాకాన్‌లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మంగళవారం ముఖ్యఅతిథిగా ఆవిష్కరించారు.
మారుమూల తండా నుంచి వచ్చిన అరవింద్ తన బాల్యాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా మాట్లాడుతూ.. అడవి అంచున ఉన్న ప్రజల బతుకుచిత్రాన్ని ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు హాస్యంతో, ఉద్వేగంతో పొందుపరిచారని ప్రశంసించారు.
