గెలుపుపై సీఎం శివరాజ్ ధీమా.. సెలబ్రేషన్స్ రెడీ అవుతున్న నేతలు

గెలుపుపై సీఎం శివరాజ్ ధీమా.. సెలబ్రేషన్స్ రెడీ అవుతున్న నేతలు

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ Xలో పోస్ట్ చేశారు. బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తెలిపారు.

భారీతీయ జనతా పార్టీ ముందుకు సాగుతుందని విశ్వసిస్తున్నానని శివరాజ్ సింగ్ అన్నారు. పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీజేపీ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు అని ముఖ్యమంత్రి ఎక్స్‌లో రాశారు. ఈ వేడుకలకు గుర్తుగా దాదాపు మంది 100 మిఠాయిల ప్యాకెట్లతో శివరాజ్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి, పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా కూడా  ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.

ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. నవంబర్ 17న మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరగ్గా, ఎన్నికల సంఘం ప్రకారం 77.15 శాతం అంటే 2018 సంఖ్య కంటే 1.52 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది.