
కరోనా వల్ల థియేటర్లు మూతబడ్డాక ఓటీటీలు ఎంటర్‌టైన్‌మెంట్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వెబ్ సిరీసులు సత్తా చాటుతున్నాయి. ఫేమస్ యాక్టర్లు, టెక్నీషియన్లు కూడా వాటివైపు మొగ్గు చూపుతూ ఉండటంతో వారికీ అవార్డులు ఇవ్వాలని పోయినేడు డిసైడ్ చేసింది ఫిల్మ్‌ఫేర్. 2021 సంవత్సరానికి నామినేట్ అయిన సిరీసుల జాబితాను రీసెంట్‌గా ప్రకటించింది. ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 పలు విభాగాల్లో నామినేట్ కావడం విశేషం. బెస్ట్ సిరీస్, బెస్ట్ డైరెక్టర్ (రాజ్, డీకే), బెస్ట్ యాక్టర్ (మనోజ్ బాజ్‌పేయ్), బెస్ట్ యాక్ట్రెస్ (సమంత), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ (షరీబ్ హష్మి, సన్నీ హిందూజా), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (ఆశ్లేషా ఠాకూర్), బెస్ట్ ఒరిజినల్ స్టోరీ, బెస్ట్ డైలాగ్స్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీల్లో నామినేషన్లు సాధించింది. యాప్ ద్వారా ప్రేక్షకులు ఓటు వేసేందుకు ఈ నెల 24 నుంచి 28 వరకు గడువు ఇచ్చింది ఫిల్మ్‌ఫేర్.