ఆక్సిజన్ అందించకపోవడం మారణకాండతో సమానం 

ఆక్సిజన్ అందించకపోవడం మారణకాండతో సమానం 

అలహాబాద్: ఆక్సిజన్ సప్లయ్ లేమితో చనిపోతున్న కరోనా పేషెంట్ల మృతి మారణకాండతో సమానమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్నో నేరపూరిత చర్యగా కోర్టు తెలిపింది. ‘ఆస్పత్రులకు ఆక్సిజన్ సప్లయ్ చేయకపోవడం వల్ల చాలా మంది కరోనా రోగుల  ప్రాణాలు పోతున్నాయి. ఇది బాధాకరం. ఆస్పత్రులకు నిరంతరంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ఒప్పుకున్న తయారీదారులు.. సమయానికి సప్లయ్ చేయకపోవడం తీవ్రమైన చర్య. ఇదో క్రిమినల్ యాక్ట్. అలాంటి వారు చేస్తున్న మారణకాండే ఇది’ అని జస్టిస్ అజిత్ కుమార్, సిద్ధార్థ వర్మల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు కావాలనే ఆక్సిజన్ సిలిండర్లను దాచి.. వాటి అవసరం ఉన్న వారికి అందించకపోవడం, ఎక్కువ ధరకు అక్రమంగా అమ్ముకోవడం పైనా కోర్టు సీరియస్ అయ్యింది.