
‘మసూద’తో హిట్ అందుకున్న తిరువీర్.. ‘పరేషాన్’ అనే రూరల్ కామెడీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకత్వంలో సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. జూన్ 2న సినిమా విడుదలవుతున్న సందర్భంగా తిరువీర్ చెప్పిన విశేషాలు..‘ఘాజీ, మల్లేశం, పలాస లాంటి చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ చేశాను. ‘మసూద’తో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘పరేషాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నా. రూపక్ రైటింగ్ చాలా కొత్తగా అనిపించింది. తను చూసిన జీవితం, ఊరు, స్నేహం, అక్కడి ప్రజల పాత్రలని తీసుకుని ఒక ఇమాజినరీ వరల్డ్‌ని క్రియేట్ చేశాడు. అన్నీ చాలా ఫ్రెష్‌గా వుంటాయి. సినిమా రానాకి నచ్చడంతో ఆయన సమర్పణలో రిలీజ్ చేస్తానన్నారు.
అలాగే ప్రమోషన్స్‌లోనూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. రానా వచ్చిన తర్వాత నాకు మరింత బలం వచ్చింది. ఇది సింగరేణి పోరగాళ్ళ కథ. మంచిర్యాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా. వాళ్ల అమాయకత్వం నుంచే కామెడీ వస్తుంది. ప్రతి పాత్రకూ ఏదో ఒక పరేషాన్ వుంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. వరంగల్, కరీంనగర్‌లో వేసిన ప్రీమియర్స్ కంటే విజయవాడలో ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ రూరల్ కామెడీ మూవీ అయినప్పటికీ, ఏరియాతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తారు. మరో నాలుగు సినిమాలకు కమిట్ అయ్యాను. థ్రిల్లర్, ఫాంటసీ, సోషల్ డ్రామా జానర్స్‌లో వుంటాయి’.