ఆడపిల్లల కోసం ‘సుకన్య సమృద్ధి’ స్కీమ్ 

ఆడపిల్లల కోసం ‘సుకన్య సమృద్ధి’ స్కీమ్ 
  •  నిరుపేదలకు హెల్ప్‌‌ చేయాలని కోరిన  పోస్టల్ డిపార్ట్ మెంట్ 

హైదరాబాద్, వెలుగు: నిరుపేద కుటుంబాలలోని బాలికల విద్య, ఉన్నతి కోసం సహాయానికి ‘అంత్యోదయ సుకన్య సమృద్ధి’ స్కీమ్‌‌ను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ ప్రారంభించింది. పేద కుటుంబాలలో 10 ఏండ్ల వయసు లోపు ఉన్న బాలికలకు అందుబాటులో ఉన్న పోస్టాఫీస్‌‌లో సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా రూ.250 జమ చేసి సహాయం చేయడానికి దాతలకు అవకాశం కల్పించినట్లు పీఐబీ శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. దాతలకు తెలిసిన పేద బాలికలు లేనట్లయితే దగ్గరలోని పోస్టాఫీస్‌‌లో  సంప్రదించి సహాయం చేయవచ్చని వెల్లడించింది. అంత్యోదయ సుకన్య సమృద్ధి అకౌంట్ స్టార్ట్‌‌ చేసి రూ.250 కట్టిన దాతలను ‘ఆప్తమిత్ర’గా.. ప్రతినెలా లేదా సంవత్సరానికి డబ్బులు కట్టిన దాతలను ‘ఆప్తబంధువు’గా పీఐబీ గుర్తిస్తుంది. మరింత సమాచారం కోసం దాతలు తమ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లేదా 040–23463701/729, sspossddn@gmail.com,dosecunderabad.ap@indiapost.gov.in లలో సంప్రదించాలని కోరింది. పేద కుటుంబంలో పుట్టిన బాలికల భవిష్యత్తు కోసం ‘బేటీ బచావో..-బేటీ పఢావో’ను కేంద్రం ప్రారంభించింది.