పాన్ ఇండియా మూవీగా సన్నిలియోన్ త్రిముఖ

పాన్ ఇండియా మూవీగా సన్నిలియోన్   త్రిముఖ

యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా  ‘త్రిముఖ’. రాజేష్ నాయుడు దర్శకత్వంలో  శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈనెల 30న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో  సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ  సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో   యోగేష్ కల్లె మాట్లాడుతూ ‘హీరోగా ఇది నా ఫస్ట్ మూవీ. ఎన్నో ఇబ్బందులు దాటుకుని  రిలీజ్ వరకు వచ్చాం.  సపోర్ట్ చేసిన ఆరిస్టులందరికీ థ్యాంక్స్.  సన్నీ లియోన్  మా మూవీకి ప్రధాన ఆకర్షణ.  

అలాగే  సీఐడీ ఆదిత్య శ్రీవాస్తవ  తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఇది. మా కంటెంట్ నచ్చి ఆయన ఒప్పుకున్నారు.  కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌ ఉన్న ఈ  కథ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’ అని అన్నాడు.  డైరెక్టర్ రాజేష్ నాయుడు మాట్లాడుతూ ‘బలమైన స్క్రీన్‌‌‌‌ప్లే, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌ ఫస్ట్ హాఫ్‌‌‌‌, ఎంగేజింగ్‌‌‌‌ సెకండాఫ్‌‌‌‌తో  థ్రిల్లింగ్‌‌‌‌గా ఉంటుంది.  ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. సన్నీ లియోన్‌‌‌‌ను గ్లామర్‌‌‌‌‌‌‌‌గానే కాకుండా కొత్తగా చూస్తారు’ అని చెప్పాడు. ఈ చిత్రంలో నటించిన  జెమినీ సురేష్,  ప్రవీణ్,  సాహితీ దాసరి తదితరులు పాల్గొన్నారు.