దేశంలో కరోనా పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు

దేశంలో కరోనా పరిస్థితులు మరింతగా దిగజారొచ్చు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో 4 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడాన్ని బట్టి వైరస్ ఎంత వేగంగా ప్రబలుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో భారత్‌‌లో మున్ముందు పరిస్థితులు మరింతగా దిగజారే ప్రమాదం ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హెచ్చరించారు. దేశ ప్రజల పరిస్థితులను చూస్తుంటూ తన గుండె బద్దలవుతోందన్న పిచాయ్.. భారత్‌ను అన్ని దేశాలు కలసి ఆదుకోవాలన్నారు. ముఖ్యంగా అమెరికా అన్ని విధాలుగా భారత్‌‌కు అండగా నిలవాలన్నారు. కాగా, భారత్‌లో కరోనా విజృంభిస్తున్నందున మన దేశానికి ఆర్థిక సాయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థ రూ.135 కోట్లను ప్రకటించింది.