సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్, స్వాతి ప్రధాన పాత్రల్లో భాస్కర్ జక్కుల రూపొందించిన చిత్రం ‘జమాన’. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్, శివకాంత్, శశికాంత్ నిర్మిస్తున్నారు. జనవరి 30న సినిమా విడుదల కానుంది. ఎమ్. జి మూవీస్ అచ్చిబాబు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, యు/ఏ సట్టిఫికెట్ పొందినట్టు మేకర్స్ తెలియజేశారు.
పాతబస్తీ నేపథ్యంలో మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్‌తో చాలా డిఫరెంట్‌గా ఈ చిత్రం ఉంటుందని, వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయని మేకర్స్ చెప్పారు. స్వాతి కశ్యప్, జారా ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కేశవ కిరణ్ సంగీతం అందించాడు.
