
- పలువురికి ఇటీవల చెక్కులిచ్చిన ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్వెంకటస్వామి
- మెదక్ జిల్లాలో మహిళా సంఘాల సభ్యులు 1,37,429 మంది
మెదక్, వెలుగు: గ్రామీణ మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) వివిధ పథకాలను అమలు చేస్తోంది. స్వయం సహాయక సంఘాల(ఎస్ హెచ్ జీలు)లో సభ్యులైన వారికి వాటి ద్వారా చేయూతనిస్తోంది. చాలా సంఘాల మహిళలు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థికసాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇటీవలే సర్కార్స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు సైతం మంజూరు చేసింది. అలాగే వివిధ కారణాలతో మృతిచెందిన సంఘాల్లోని సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా పరిహారం మంజూరైంది.
ఇందిరా మహిళా శక్తి సంబురాల సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి జి.వివేక్ వెంకటస్వామి చేతులమీదుగా పలువురికి ఆర్థికసాయం చెక్కులు పంపిణీ చేశారు. ఇలా వివిధ పథకాల కింద మెదక్జిల్లా మహిళల అకౌంట్లలో రూ.136.49 కోట్లు జమయ్యాయి.
ఏ పథకాల కింద ఎంతంటే..
బ్యాంక్ లింకేజీ కింద జిల్లా వ్యాప్తంగా 1,308 స్వయం సహాయక సంఘాలకు రూ.112.44 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.10.38 కోట్లు, వడ్డీ లేని రుణాలు 10,547 ఎస్ హెచ్ జీలకు రూ.13.01 కోట్లు మంజూరయ్యాయి. అలాగే మృతి చెందిన 10 మందికి ప్రమాద బీమా కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.కోటి, లోన్ బీమా కింద 72 మంది సభ్యులకు రూ.52.67 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది.
మెదక్ జిల్లాలోని వివిధ గ్రూపుల వివరాలు
జిల్లా సమాఖ్య 1
మండల సమాఖ్యలు 20
విలేజ్ఆర్గనైజేషన్లు 517
వుమెన్ ఎస్ హెచ్ జీలు 13,081
పీడబ్ల్యూడీ ఎస్ హెచ్జీలు 172
మొత్తం ఎస్హెచ్జీలు 13,253
ఎస్హెచ్ జీల సభ్యులు 1,37,429