ఇవాళ( సెప్టెంబర్ 16) అర్థరాత్రి నుంచి.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

 ఇవాళ( సెప్టెంబర్ 16) అర్థరాత్రి నుంచి.. తెలంగాణలో  ఆరోగ్యశ్రీ సేవలు బంద్?

హైదరాబాద్, వెలుగు: బకాయిలు చెల్లించకుంటే ప్రైవేట్ నెట్​వర్క్ ఆసుపత్రుల్లో నేటి(మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ పెడ్తామని తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్​వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్(టీఏఎన్​హెచ్ఏ) హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా బకాయిలు పేరుకుపోయాయని, దీంతో నెట్​వర్క్ ఆస్పత్రులు ఆర్థిక కష్టాల్లో కూరు కుపోయాయని పేర్కొంది. 

ఇదిలా ఉంటే, సోమవారం ఆరోగ్య శ్రీ నెట్​వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే, నెట్ వర్క్ హాస్పిటల్స్ మేనేజ్​మెంట్లు మాత్రం బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. మొత్తం రూ.1400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, మొత్తం క్లియర్ చేయాలని టీఏఎన్​హెచ్ఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ వద్దిరాజు రాకేశ్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు.