రూ.1.54 కోట్ల హైలెవల్బ్రిడ్జికి భూమిపూజ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

రూ.1.54 కోట్ల హైలెవల్బ్రిడ్జికి భూమిపూజ : ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

జన్నారం, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం  కృషిచేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్, బాదంపల్లి గ్రామాల మధ్య ఉన్న మత్తడిపై రూ.1.54 కోట్ల నిధులతో నిర్మించే హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరైన రోడ్డు మార్గాలు లేని మారుమూల గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అనంతరం జన్నారం లోని మండల పరిషత్ ఆఫీస్​లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్ బక్కయ్య, డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ అలీఖాన్, జిల్లా జనరల్ సెక్రటరీ సయ్యద్ ఇసాక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిఉల్లా, మాజీ చైర్మన్ ముత్యం సతీశ్ తదితరులు పాల్గొన్నారు.