మొజ్తబా ఖమేనీని కలుస్తా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

మొజ్తబా ఖమేనీని కలుస్తా.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్

వాషింగ్టన్: అణ్వాయుధాల తయారీ కార్యక్రమాన్ని పక్కనపెట్టేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అన్నీ సజావుగా సాగితే ఏదో ఒక సమయంలో తాను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సమావేశం కూడా కావచ్చని చెప్పారు. 

బుధవారం ప్రసారమైన ‘పాడ్ ఫోర్స్ వన్’ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శత్రుత్వాన్ని ముగించే చర్చలలో ఖమేనీ ప్రమేయం గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఆయన ప్రమేయం ఖచ్చితంగా ఉంది. ప్రజలకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను’’ అని అన్నారు. అయితే, ఖమేనీని కలిసే అవకాశం తనకు కలగలేదన్నారు.