హైదరాబాద్, వెలుగు: పార్టీ లైన్ ఎవరు దాటినా కఠిన చర్యలు తప్పవని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, బీజేపీ నేతల విమర్శలపై స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డికి సంబంధించిన అంశాలను ఇప్పటికే ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
హైకమాండ్‌తో చర్చించిన అనంతరం వారిపై తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలపై మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదని, ఆయన ఒక ‘నిప్పు’ అని కౌంటర్ ఇచ్చారు.
