- కామన్‌వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్
- తొలి అంతర్జాతీయ సదస్సుకు హాజరు
హైదరాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. కామన్‌వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (సీఎల్‌ఈఏ) నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు నోవాటెల్ హోటల్‌లో సదస్సు ప్రారంభోత్సవం జరగనుంది.
రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఢిల్లీ, కేరళ, కర్నాటక హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోశీ పాల్గొననున్నారు. సీనియర్ న్యాయవాదులు, న్యాయ విశ్వవిద్యాలయాల వీసీలు, ప్రొఫెసర్లు, వివిధ కామన్‌వెల్త్ దేశాలకు చెందిన న్యాయ నిపుణులు హాజరు కానున్నారు.
