హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం భోపాల్‌లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. ఇటీవల శివరాజ్ సింగ్ చౌహాన్ తల్లి మరణించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల ఆయనకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తల్లి మరణం ప్రతి ఒక్కరి జీవితంలోనూ తీరని లోటని, అమ్మ ప్రేమ, ఆప్యాయత, ఆశీస్సులు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. తుమ్మల వెంట తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, సహకార శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ రాజ్ తదితరులు ఉన్నారు.
