శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో మురళీకాంత్ రూపొందించిన చిత్రం ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఈ టైటిల్ నాకు చాలా నచ్చింది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే.. చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా మారుతుందని అనిపించింది.
సమాజంలోని బలహీనతను దమ్ముతో దండోరా వేయించి చెప్పేందుకు చాలా గట్స్ ఉండాలి. అలాగే మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు ఇందులో నటించారు. వారితోపాటు డైరెక్టర్ మురళీ, ప్రొడ్యూసర్ బెన్నీ గారికి ఈ చిత్రం మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు. శివాజీ మాట్లాడుతూ ‘నిర్మాత బెనర్జీ గారికి కథల మీద మంచి పట్టు ఉంది.
మురళీకాంత్ సినిమాలపై ప్యాషన్‌తో అమెరికా నుంచి వచ్చి మంచి కథను రాశాడు. నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. రీ ఎంట్రీలో మంచి కథ, మంచి చిత్రమైతేనే చేయాలని ఫిక్స్ అయ్యా. ప్రపంచమంతా మా ‘దండోరా’ సౌండ్ వినిపిస్తుంది’ అని అన్నాడు. ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం తమకు వెరీ స్పెషల్ అని నటీనటులు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
