పంత్‌.. ఇలా ఆడితే కష్టమే

పంత్‌.. ఇలా ఆడితే కష్టమే

కోల్‌కతా: భారత స్టార్ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రదర్శనపై న్యూజిలాండ్ సీనియర్ ప్లేయర్ డానియల్ వెటోరి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. టీమ్‌లో తన రోల్ ఏంటనే దానిపై పంత్ స్పష్టతతో ఉండాలని వెటోరి సూచించాడు. ప్రస్తుతం బ్యాడ్ ఫామ్‌లో ఉన్న పంత్.. ఇలాగే ఆడితే జట్టులో కొనసాగడం కష్టమని హెచ్చరించాడు. టీ20 క్రికెట్‌కు అవసరమైన టెంపోను అతడు అలవాటు చేసుకోవాలన్నాడు. 

‘టీ20 క్రికెట్‌కు అవసరమైన టెంపోను కొనసాగించడంలో పంత్ తరచూ విఫలమవుతున్నాడు. జట్టులో తన రోల్ ఏంటనేది అతడు అర్థం చేసుకోవడం లేదు. కివీస్ సిరీస్‌లో ఇది కొట్టొచ్చినట్లు కనిపించింది. కొన్నిసార్లు మరీ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకొన్ని సార్లు నిర్లక్ష్యంగా షాట్లు కొడుతున్నాడు. అతడి ఆటతీరులో ప్లాన్ లోపిస్తోంది. బ్యాటింగ్‌లో ఓ ఫ్లోను కొనసాగిస్తూ, సందర్భానుసారం షాట్లు ఆడాలి. ఈ సీజన్‌లో పంత్ బాగా బ్యాటింగ్ చేయకపోతే అతడి ప్లేస్‌ను ఇషాన్ కిషన్ భర్తీ చేసే చాన్స్ కనిపిస్తోంది. పంత్ నుంచి అసలేం కోరుకుంటున్నారో అతడికి టీమ్ మేనేజ్‌మెంట్ అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే పంత్ కూడా బ్యాటింగ్‌లో సరైన టెంపోను అందుకోవాలి. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలరు. కాబట్టి, పంత్ రాణించకపోతే అతడి స్థానానికి ప్రమాదం తప్పదు’ అని వెటోరి పేర్కొన్నాడు. కాగా, కివీస్‌తో ఆదివారం ముగిసిన టీ20 సిరీస్‌లో వరుసగా 17, 12, 4 రన్స్‌ చేసిన పంత్.. తనపై పెట్టుకున్న అంచనాల్ని అందుకోవడంలో విఫలమయ్యాడు.

మరిన్ని వార్తల కోసం: 

ఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ల దాడి

పరేడ్‌లో విషాదం: పబ్లిక్ పైకి దూసుకెళ్లిన ఎస్‌యూవీ