ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణే కథ.. ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ అండ్ రియలిస్టిక్ ఎంటర్‌టైనర్

 ప్రేమ, పెళ్లి మధ్య సంఘర్షణే కథ.. ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ అండ్ రియలిస్టిక్ ఎంటర్‌టైనర్

సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా పరమేష్‌‌ రేణు కుంట్ల తెరకెక్కించిన చిత్రం ‘ఐ హేట్‌‌ మ్యారేజ్‌‌’. మాదం దయానంద్‌‌, కార్తీక్‌‌ వెంపటి నిర్మించారు. శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్‌‌మీట్‌‌ నిర్వహించారు. ​అతిథిగా హాజరైన నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌‌ మాట్లాడుతూ ‘సొసైటీలో ఉన్న డార్క్‌‌ సీక్రెట్‌‌.. డేరింగ్‌‌ ఎలిమెంట్స్‌‌తో పరమేష్‌ ఈ సినిమా తీశాడు. బోల్డ్ అనుకునే వాళ్లకు ఇది బోల్డ్‌‌ స్టోరీ’ అని చెప్పారు.  దర్శకుడు పరమేష్‌‌ మాట్లాడుతూ ‘మనం మాట్లాడుకోవడానికి, చదవడానికి ఇష్టపడని సంఘటనల సమాహారమే ఈ చిత్రం. 

ఇది బోల్డ్‌‌ కంటెంట్‌‌ కాదు.. చూడటానికి ఇష్టపడని మెచ్యూర్డ్‌‌ కంటెంట్‌‌. కలిసి తిరుగుతున్న ప్రేమజంటలు పెళ్లి మాత్రం పేరెంట్స్‌‌ చెప్పిన వాళ్లనే ఎందుకు చేసుకుంటున్నారు, ప్రేమించిన వాళ్ల కోసం ఎందుకు ఫైట్ చేయడం లేదు అనేది వాస్తవికతకు దగ్గరగా చూపించాం’ అని చెప్పాడు. జెన్‌‌ జీ తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించామని నిర్మాత మాదం దయానంద్ తెలిపారు.  హీరోయిన్‌‌ జుప్సీ భద్ర,  సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి,  ఎడిటర్‌‌ ఆవుల వెంకటేష్‌‌ తదితరులు పాల్గొన్నారు.