హుజురాబాద్‌‌‌‌‌‌‌‌లో పట్టపగలే భారీ చోరీ...టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలతో పరార్

హుజురాబాద్‌‌‌‌‌‌‌‌లో పట్టపగలే భారీ చోరీ...టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలతో పరార్

హుజురాబాద్, వెలుగు: కరీంనగర్​ జిల్లా హుజురాబాద్​లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారిపై టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రాయికల్​కు చెందిన గుంపుల సంతోష్ యాదవ్ బుధవారం హుజురాబాద్​లోని వరంగల్ రోడ్డు తాజ్ రెస్టారెంట్ సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ.2 లక్షల నగదు విత్ డ్రా చేశాడు. ఆ డబ్బును తన టాటా ఏస్ వాహనంలో పెట్టి, అద్దాలు మూసేసి పక్కనే టీ తాగేందుకు వెళ్లాడు. 

సంతోష్​ను ముందు నుంచే గమనిస్తున్న ఇద్దరు దుండగులు బైక్‌‌‌‌‌‌‌‌పై వచ్చి క్షణాల వ్యవధిలో టాటా ఏస్ కిటికీ అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న నగదు బ్యాగును తీసుకుని పరారయ్యారు. కొద్దిసేపటికి వచ్చి చూసిన సంతోష్ యాదవ్​కు వాహనంలో డబ్బులు కనిపించలేదు. వెంటనే సమీపంలోని బ్యాంకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బైక్‌‌‌‌‌‌‌‌పై వచ్చి చోరీకి పాల్పడిన దృశ్యాలు కనిపించాయి. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. బ్లూకోల్ట్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.