ఆఫీసుకి 9:30కి రావాలి.. కానీ పని అయిపోయాకే వెళ్లాలి : స్టార్టప్ కంపెనీ కండిషన్స్ చూసి నెటిజన్లు షాక్!

ఆఫీసుకి 9:30కి రావాలి.. కానీ పని అయిపోయాకే వెళ్లాలి : స్టార్టప్ కంపెనీ కండిషన్స్ చూసి నెటిజన్లు షాక్!

సాధారణంగా మనం లింక్డ్ఇన్, ఇండీడ్ లేదా గ్లాస్‌డోర్ వంటి సైట్స్ లో ఏదైనా జాబ్ కోసం వెతికేటప్పుడు జీతం, అర్హతలు చూస్తాం. కానీ ఒక స్టార్టప్ కంపెనీ పంపిన మెయిల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.  అందులో కంపెనీ పెట్టిన కఠినమైన రూల్స్ చూసి అందరు  హడలెత్తిపోతున్నారు.

విషయం ఏంటంటే ఓ వ్యక్తి తనకు వచ్చిన ఉద్యోగ వివరాలను రెడ్డిట్ లో షేర్ చేసాడు. అందులో కంపెనీ పెట్టిన కండిషన్స్ ఏంటంటే ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకి రావాలి. కానీ వెళ్లే సమయం మాత్రం పని పూర్తయినాక... అంటే రాత్రి ఏ టైం అయినా అవ్వొచ్చు. అలాగే రోజుకు కనీసం 10 నుండి 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది అని పేర్కొంది. 

 అలాగే మేము చాలా వేగంగా పని చేస్తాం. ఇక్కడ పని ఒత్తిడి తట్టుకోలేక చేరిన మొదటి రెండు నెలల్లోనే చాలా మంది మానేసి వెళ్లిపోయారు అని  కంపెనీ ముందే హెచ్చరించింది. ఏదైనా కొత్తది సాధించాలంటే సమయం పడుతుంది, అందుకే ఈ కష్టం తప్పదు అన్నట్లుగా ఆ మెయిల్ ఉంది.

►ALSO READ | అహ్మదాబాద్‌లో దారుణం: మహిళను చెంపదెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ !

పని గంటలు ఎక్కువ ఉండటం కంటే, ఆ మెయిల్‌లో వాడిన భాష నన్ను బాధించింది. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం పాడైపోతుందని  తెలిసినా, ఒకవేళ మీరు తట్టుకోలేకపోతే అది మీ తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ ప్రకటన కాదు.. అక్కడికి వెళ్లొద్దని చెబుతున్న ప్రమాద హెచ్చరిక అని ఒకరు అనగా... ఎక్కువ పని చేయించుకున్నప్పుడు, జీతం కూడా ఎక్కువ ఇస్తారా... అని మరొకరు అన్నారు.  ఇండియాలో ఇలాంటి విషపూరిత పని సంస్కృతి పెరిగిపోతోంది. ఉద్యోగులను మెషిన్స్ల  చూడటం కరెక్ట్ కాదు  అని చాలా మంది మండిపడుతున్నారు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేని ఇలాంటి కంపెనీల తీరుపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.