అక్కడ ‘దసరా బొమ్మలు’ ఎంతో ప్రత్యేకం

V6 Velugu Posted on Oct 14, 2021

దసరా ఉత్సవాలకి దేశవ్యాప్తంగా ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మైసూర్​ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. మైసూర్​కు 10 కిలో మీటర్ల దూరంలో ఉండే నాజర్​బాద్​ ఊళ్లో దసరా వేడుకల సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుంది. అక్కడ ‘దసరా బొమ్మలు’ ఎంతో ప్రత్యేకం. నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసిన బొమ్మలను పూజిస్తారు. దసరా అంటే రాక్షసులపై దుర్గామాత విజయాన్ని సూచిస్తుంది. మహారాజుల కాలం నుంచి నిర్వహించే పండుగ. దీని చిహ్నంగా నాజర్​బాద్​లో వారసత్వ బొమ్మలను తయారు చేస్తారు. ఇందులో భారతీయ సంస్కృతి గొప్పదనం, మహారాజుల వైభవం గొప్పగా కనిపిస్తుంది. ఈ బొమ్మలను భక్తులకు అమ్ముతారు కూడా. మైసూర్​ ప్యాలెస్​లో వీటిని అమ్మడానికి ప్రత్యేకంగా ‘డాల్​ హౌస్​’ కూడా ఉంది. ఈ బొమ్మల సంస్కృతి విజయనగర సామ్రాజ్య కాలంలో మొదలైంది. దసరా బొమ్మలు కర్ణాటకలోని చాలా ఇళ్లలో, ముఖ్యంగా దసరా పది రోజుల్లో  కనిపిస్తాయి. వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులను, రాజులను, దేవతలను, పురాణాల పాత్రలను బొమ్మతో కలిపి థీమెటిక్​గా తయారు చేస్తారు. ‘ఈ బొమ్మలు ప్రజల సంస్కృతిని సూచిస్తాయి. వృత్తులు, దేవతలు, చారిత్రక సంఘటనల వినోదాలతో సహా అన్నీ కనిపిస్తాయి’  అంటున్నారు బెంగళూర్​ చరిత్రకారులు. 

Tagged life, Festival, dasara, dolls, , very special

Latest Videos

Subscribe Now

More News