ఢిల్లీలో 13 సివిల్స్ కోచింగ్ సెంటర్లు సీజ్.. కొనసాగుతున్న నిరసనలు

ఢిల్లీలో 13 సివిల్స్ కోచింగ్ సెంటర్లు సీజ్.. కొనసాగుతున్న నిరసనలు

బేస్‌మెంట్‌(గ్రౌండ్ ఫ్టోర్)లో కోచింగ్ సెంటర్లు, వ్యాపారాలు కార్యకలాపాలు నిర్వహించే 13 ఇన్‌స్టిట్యూట్‌లను మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) సీల్ చేసింది. ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని సివిల్స్ అకాడమీలపై ఇన్‌స్టిట్యూట్‌లపై ఆదివారం మున్సిపల్ అధికారులు దాడులు దాడులు చేశారు. రాజిందర్ నగర్ లోని రావుస్ IAS స్టడీ సర్కిల్ లోని బేస్ మెంట్ లో శనివారం రాత్రి నీటి మునిగి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోయిన విషయం తెలిసిందే. 

విద్యార్థుల మృతికి మేయర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆదివారం మేయర్ నివాసం ఎదుట నిరసనకు దిగారు. డ్రైనేజ్ క్లీన్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని సివిల్స్ అభ్యర్ధులు, విద్యార్థులు సోమవారం కూడా ఆందోళనలు ఇంకా కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. MCD అధికారులు ఆదివారం రైడ్స్ చేశారు. అనుమతులకు విరుద్దంగా బేస్ మెంట్ ఫ్లోర్ లో  స్టడీ సర్కిల్లను, లైబ్రరీలను, బుక్ స్టాల్స్, క్లాసులను నిర్వహిస్తున్న 13 బిల్డింగును మూసివేశామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ తెలిపారు.

రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినందుకు ఎంసీడీ అధికారులు ఎవరైనా బాధ్యులేతే వెంటనే విచారణ జరుపుతామని మేయర్ అన్నారు. ఏ అధికారి అయినా దోషిగా తేలితే, వారిపై కఠినమైన  చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు ఆమె.

2023లో ముఖర్జీ నగర్‌లోని ఒక IAS కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు నిబంధనలను ఉల్లంఘిస్తున్న బిల్డింగులు,  కోచింగ్ సెంటర్‌లపై సర్వే చేయడం ప్రారంభించారు.

సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దాన్ని మధ్యలోనే ఆపివేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించి నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను తక్షణమే మూసివేయాలని ఈ ఏడాది మేలో ఢిల్లీ హైకోర్టు MCD, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీని ఆదేశించింది.


సీజ్ చేసిన సివిల్స్  ఇన్‌స్టిట్యూట్లు: 

  • IAS గురుకులం
  • చాహల్ అకాడమీ
  • ప్లూటస్ అకాడమీ
  • సాయి ట్రేడింగ్
  • IAS సేతు
  • టాపర్స్ అకాడమీ
  • దైనిక్ సంవాద్
  • సివిల్ డైలీ IAS
  • కెరీర్ పవర్
  • 99 నోట్లు
  • విద్యా గురు
  • గైడెన్స్ IAS
  • ఈసీ ఫర్ ఐఏఎస్‌