జైనూర్ లో 144 సెక్షన్ ..1000 మంది పోలీసులతో భద్రత

జైనూర్ లో 144 సెక్షన్ ..1000 మంది పోలీసులతో భద్రత

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూరు లో  144 సెక్షన్ విధించారు పోలీసులు. పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు  డీజీపీ జితేందర్ ప్రకటించారు.  ఆదివాసీ మహిళపై లైంగిక దాడి ఘటనతో బంద్ కి పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాలు.  దీంతో  రెండు వర్గాల మధ్య ఘర్షణలు, రాళ్లదాడి జరగడంతో  పలువురికి గాయాలు అయ్యాయి.  పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు డీజీపీ.  ప్రస్తుతానికి జైనూరు పోలీస్ పహారాలో  ఉంది. ఎవరైనా సరే  చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు.

 సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మోద్దని సూచించారు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం.  ఇతరులకు  జైనూరులోకి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. మతవిద్వేశాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు.

ALSO READ | ఆదివాసీ మహిళపై లైంగికదాడి.. అట్టుడుకుతోన్న ఆసిఫాబాద్

మరో వైపు ఈ ఘటనపై డీజీపీకి ఫోన్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్ . సెప్టెంబర్ 31న  ఘటన జరిగితే ఆలస్యంగా బయటకు రావడంపై ఆరా తీశారు. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన  నిందితుడు షేక్ మగ్దూంకు  శిక్ష పడేలా కఠిన  చర్యలు తీసుకోవాలన్నారు.

 బాధితురాలిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పరామర్శించారు మంత్రి సీతక్క. దాడి గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.