నిజామాబాద్, వెలుగు : జిల్లా పోలీస్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ సాయిచైతన్య ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత ఠాణా ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు సాయం అందేలా చూడాలని సూచించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను కలిసేందుకు ప్రజావాణిని వినియోగించుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లేడీ కానిస్టేబుల్ అల్లం మాధురి, హోంగార్డ్‌గా పని చేస్తున్న ఆమె తండ్రి అల్లం భూమయ్యను సీపీ హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. తండ్రీకూతురు టూవీలర్‌పై డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వస్తుండగా సాయినగర్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ఢీకొట్టింది. దీంతో తండ్రీకుతుళ్లకు తీవ్రగాయాలు కాగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
