చరిత్ర సృష్టించిన గుకేశ్.. అతి చిన్న వయసులోనే క్యాండిడేట్స్‌ టోర్నీలో గెలుపు

చరిత్ర సృష్టించిన గుకేశ్.. అతి చిన్న వయసులోనే క్యాండిడేట్స్‌ టోర్నీలో గెలుపు

చెస్ ప్లేయర్ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. తన అద్బుత ప్రదర్శనతో ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీలో విజయం సాధించాడు. 17 ఏళ్ల గుకేశ్ అతి చిన్న వయసులోనే టోర్నీ టైటిల్ గెలుచుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఫిడే క్యాండిడేట్స్‌ టైటిల్‌ను నెగ్గిన రెండో భారత ఆటగాడిగా గుకేశ్‌ నిలిచాడు. దీంతో ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. 

13వ రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన పిరౌజా అలీరెజాను ఓడించి 8.5 పాయింట్లతో టోర్నీలో సోలోగా ఫస్ట్ ప్లేస్ ను దక్కించుకున్న గుకేశ్‌.. 47 ఎత్తుల్లో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. తర్వాత జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. గుకేశ్ విజయంపై విశ్వనాథన్ ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందించారు.

  ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఆడనున్న గుకేశ్‌కు శుభాకాంక్షలు.. అతి పిన్న వయస్కుడైన చాలెంజర్‌గా మారినందుకు అభినందిచారు. నీ విజయానికి వాకా చెస్‌  కుటుంబం చాలా గర్వపడుతున్నది. క్లిష్ట పరిస్థితుల్లో నీ ఆటను, ఎదుర్కొన్న తీరు తనకు చాలా గర్వంగా ఉందంటూ విశ్వనాథన్ ఆనంద్ తెలిపారు. 

గతంలో మాగ్నస్ కార్ల్‌సన్, కాస్పరోవ్‌ 22 ఏళ్ల వయసులో ఛాంపియన్లుగా నిలిచారు.