దేశంలో 437 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో 437 కు చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ ఉదృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కేసులు  పెరుగుతున్నాయి. రాజస్థాన్ లో ఇవాళ  ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాజస్థాన్ లో ఒమిక్రాన్ కేసులు మొత్తం 43 కు చేరాయని ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 437 కు చేరాయి. 

అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీ 79, గుజరాత్ 43, రాజస్థాన్ 43, తెలంగాణ 38, కేరళ 37,తమిళనాడు 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. హర్యానా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్ 3, పశ్చిమ బెంగాల్ లలో   3, ఉత్తర ప్రదేశ్ లో 2,  చండీగఢ్, ఉత్తరాఖండ్ , లడఖ్ లలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో  అస్సాంలో ప్రతి రోజు రాత్రి 11.30 నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. న్యూ ఇయర్ రోజున ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది.