భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే.?

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో తులం ఎంతంటే.?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం 57,300 వరకు దిగొచ్చిన బంగారం ధర రోజురోజుకు క్రమంగా పెరుగుతోంది.  ఇవాళ ఒక్కరోజే బంగారం ధర 660 పెరిగి 62 వేలు దాటింది. 

ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 660 పెరిగి రూ. 62,620కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.57,400కి చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 494 పెరిగి రూ. 46,964కు చేరింది.

విజయవాడలో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 660 పెరిగి రూ. 62,620గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగి రూ. 57,400కి చేరింది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46, 964గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ 660 పెరిగి..రూ. 62,770గా ఉండగా.. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ. 57,550 గా ఉంది. 18 క్యారెట్ల బంగారం రూ. 466 పెరిగి రూ. 47,086గా ఉంది.