ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. లైట్లు పడి మోడల్ మృతి

ఫిల్మ్ సిటీలో ప్రమాదం.. లైట్లు పడి మోడల్ మృతి

నోయిడాలోని ఫిల్మ్ సిటీలోని స్టూడియోలో జరిగిన ఫ్యాషన్ షోలో లైటింగ్ ట్రస్ కూలడంతోఓ  మోడల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తికి  తీవ్ర గాయాలయ్యాయి .  దీంతోఅతన్ని  ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రాణాలు కోల్పోయిన యువతిని గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీ-2 నివాసి వంశిక చోప్రాగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని  బాబీ రాజ్ గా గుర్తించారు.   ఫ్యాషన్ షో నిర్వాహకుడితో పాటుగా లైటింగ్ ట్రస్‌ను అమర్చిన వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  మోడల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

రెండు కుటుంబాలకు సమాచారం అందించామని పోలీసులు చెప్పారు. ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఫ్యాషన్ షోలో ఇనుప స్తంభం పడిపోవడం వల్ల మోడల్ వంశిక చోప్రా మరణించింది. మృతదేహానికి సంబంధించిన పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తామని నోయిడా అదనపు డీసీపీ శక్తి అవస్థి చెప్పారు. అయితే షో నిర్వాహకులు ఫ్యాషన్‌ షో నిర్వహణకు అనుమతి తీసుకోలేదని తెలుస్తున్నది.