గండిపేట,వెలుగు: ఆధార్, పాన్ కార్డుల్లో ఫొటోలు, పేర్లు, పుట్టిన తేదీలు, అడ్రస్లు అక్రమంగా మారుస్తూ దందా చేస్తున్న ఒకరిని శంషాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు, పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి శ్రీరామ్ కాలనీకి చెందిన చింతల మహదేవ్ (36) బుద్వేల్లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ‘కవిత ఏ టు జెడ్ ఆన్‌లైన్ సర్వీసెస్’ పేరుతో జిరాక్స్ సెంటర్రన్ చేస్తున్నాడు.
ఏడో తరగతి వరకు చదువుకున్న మహదేవ్ కు జిరాక్స్ ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ఆధార్, పాన్ కార్డుల్లో అక్రమంగా మార్పులు చేస్తున్నాడు. వీటిని పలువురు ప్రైవేట్ ఉద్యోగాలు పొందేందుకు, మొబైల్ సిమ్ కార్డులు తీసుకునేందుకు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు వాడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని టాస్క్ఫోర్స్ అడిషనల్ డీసీపీ కె.ఎస్. రావు వెల్లడించారు.
