డెల్ టెక్నాలజీస్ ఏలియన్‌వేర్ ఎం18, ఏలియన్‌వేర్ ఎక్స్16 ఆర్1, ఇన్‌స్పిరాన్ 16, ఇన్‌స్పిరాన్ 16 (2-ఇన్-1) ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. అన్ని ల్యాప్‌టాప్‌లలో 13వ జెనరేషన్ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఉంటాయి. ఇన్‌స్పిరాన్ సిరీస్ ల్యాప్‌టాప్‌లకు వైఫై6ఈ టెక్నాలజీని వాడారు. ఏలియన్‌వేర్ ఎం18 ధర రూ. 3,59,990 కాగా, ఏలియన్‌వేర్ ఎక్స్16 ఆర్1 ప్రారంభ ధర రూ. 3,79,990. ఇన్‌స్పిరాన్ 16 ప్రారంభ ధర రూ. 77,990, ఇన్‌స్పిరాన్ 16 కన్వర్టబుల్ ల్యాప్‌టాప్ ధర రూ. 96,990. అమ్మకాలు మొదలయ్యాయి.
