ముంబైకి ఎయిర్ అంబులెన్సులో గ్రీన్ ఫంగస్ పేషెంట్ 

V6 Velugu Posted on Jun 16, 2021

కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు బయటపడుతున్నాయి. లేటెస్టుగా మరో ఫంగస్ బయటపడింది. అదే గ్రీన్ ఫంగస్. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో 34 ఏళ్ల ఓ వ్యక్తిలో ఈ ఫంగస్ ను గుర్తించారు. దీంతో ఆ పేషెంట్ ని హుటాహుటిన ఇండోర్ నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్సులో తరలించారు.సైనస్, లంగ్స్, బ్లడ్ లో గ్రీన్ ఫంగస్ అభివృద్ధి చెందినట్టు బయటపడిందని తెలిపారు ఇండోర్ లోని శ్రీ అరబిందో ఇస్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి డాక్టర్లు. పేషెంట్ ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని హిందుజా ఆస్పత్రికి తరలించారు. 

గ్రీన్ ఫంగస్ పేషెంట్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడని.. అయితే, ఆ తర్వాత ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం వంటి వాటితో బాధపడ్డారని డాక్టర్ రవి తెలిపారు. అంతేకాదు.. ఆయన బరువు తగ్గి, చాలా బలహీనంగా మారారని చెప్పారు. గ్రీన్ ఫంగస్ పై రీసెర్చ్ జరగాల్సి ఉందని... కరోనా నుంచి కోలుకున్న వారిపై ఈ ఫంగస్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Tagged Indore, Mumbai, 34-year-old patient, green fungus, airlifted

Latest Videos

Subscribe Now

More News