ఆర్టీఏ అధికారుల కొరడా.. 37 స్కూల్ బస్సులు సీజ్

ఆర్టీఏ అధికారుల కొరడా.. 37 స్కూల్  బస్సులు సీజ్

 తెలంగాణ వ్యాప్తంగా స్కూల్, కాలేజీ బస్సులపై  ఆర్టీఏ అధికారుల తనిఖీలు  కొనసాగుతున్నాయి. ఫిట్ నెస్ లేకుండా నడుపుతున్న బస్సులపై కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నారు.  

లేటెస్ట్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీలను అధికారులు తనిఖీలు చేశారు. ఫిట్ నెస్ లేని , టాక్సీ కట్టని 34 బస్సులు సీజ్ చేశారు. ఫిట్ నెస్ లేని15 సంవత్సరాలు దాటిన విద్యాసంస్థల బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల పై తిప్పొద్దన్నారు. 60 ఏండ్లు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపొద్దని హెచ్చరించారు. ప్రతీ విద్యాసంస్థ.. బస్సులకు తప్పనిసరిగా రవాణాశాఖ కార్యాలయంలో ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు ఆర్టీఏ అధికారులు .

జగిత్యాల జిల్లాలోను స్కూల్ బస్సులను  తనిఖీ చేశారు ఆర్టీఏ అధికారులు .. బస్సు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తనిఖీ చేశారు. ఫిట్నెస్ లేని 3 స్కూల్ బస్సులను  సీజ్ చేశారు.  జిల్లాలో 464 స్కూల్ కాలేజ్ బస్సులో గాను 300 పైసలు బస్సుల మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని మిగతా బస్సులు కూడా ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని సూచించారు.  ఫిట్నెస్ లేని స్కూల్ కాలేజ్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో   స్కూల్స్ ప్రారంభం కావడంతో  భువనగిరిలో ప్రైవేట్ స్కూల్ బస్సుల పైన ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ బస్సులు నడుపుతున్న  రెండు  బస్సుల పైన జరిమానా విధించారు అధికారులు.