తెలుగు అకాడమీలో 51 కోట్ల గోల్ మాల్...

తెలుగు అకాడమీలో 51 కోట్ల గోల్ మాల్...
  • విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ

హైదరాబాద్: తెలుగు అకాడమీకి సంబంధించి 51 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ల గోల్ మాల్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ తనిఖీలు చేపట్టింది. హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీలో పనిచేస్తున్న ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి.. నిధుల గోల్ మాల్ పై ఆరాతీశారు. విచారణ కమిటీ హెడ్ గా ఉన్న ఐఏఎస్  ఉమర్ జలీల్ ఆధ్వర్యంలో ప్రతి రికార్డును అధికారులు పరిశీలిస్తున్నారు.
తెలుగు అకాడమీకి 34 బ్యాంకుల్లో అకౌంట్స్ ఉండగా.. రెండు బ్యాంకులలో డబ్బులు ఖాళీ చేశారు. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి అకౌంట్స్ క్లోజ్ చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్వాన్, సంతోష్ నగర్ బ్రాంచ్ ల్లో ఈ ఫ్రాడ్ జరిగింది. ఒక బ్రాంచ్ నుంచి 43 కోట్లు.. ఇంకో బ్రాంచ్ నుంచి 8 కోట్ల నిధులను కొట్టేశారు. విషయాన్ని బ్యాంక్ డీజీఎం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేకపోవడంతో.. ఈనెల 24న సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది.