కామారెడ్డి జిల్లాలో వైన్స్ షాపులకు 57 అప్లికేషన్లు

కామారెడ్డి జిల్లాలో వైన్స్ షాపులకు 57 అప్లికేషన్లు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో వైన్స్​ షాపులకు ఇప్పటి వరకు 57 అప్లికేషన్లు వచ్చినట్లు  ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి పేర్కొన్నారు.  జిల్లాలో అప్లికేషన్ల స్వీకరణ పక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 12, దోమకొండ పరిధిలో 6, ఎల్లారెడ్డి పరిధిలో 3, బాన్సువాడ పరిధిలో 15, బిచ్​కుంద పరిధిలో 21 అప్లికేషన్లు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు. జిల్లా ఎక్సైజ్​ అధికారి హన్మంత్​రావు , సీఐలు, ఎస్సైలు ఉన్నారు.