78 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కటింగ్ షాపులో.. దళిత ప్రజల్లో చెప్పలేని ఆనందం..

78 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కటింగ్ షాపులో..  దళిత ప్రజల్లో చెప్పలేని ఆనందం..

భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల తరువాత గుజరాత్‌లోని అల్వాడ గ్రామంలో ఒక దళిత యువకుడికి మొదటిసారిగా కటింగ్ షాపులో కేర్ కటింగ్ జరిగింది. దింతో అక్కడి దళిత ప్రజల్లో ఆనందం చిగురించింది. 

సమాచారం ప్రకారం, గుజరాత్‌ బనస్కాంత జిల్లా అల్వాడ గ్రామంలో దాదాపు 6 వేల 5 వందల మంది ప్రజలు ఉంటున్నారు, వీరిలో 250 మంది దళితులు ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ గ్రామంలోని కటింగ్ షాపు వాళ్ళు దళితులకి  కటింగ్ చేసే వాళ్ళు కాదు. దింతో అక్కడి  దళితులు పక్క ఊర్లోకి  వెళ్లి ఈ కటింగ్ చేయించుకోవాల్సి వచ్చేది. 

దీని గురించి 58 ఏళ్ల చోగాజీ చౌహాన్ స్వాతంత్రానికి ముందే మా పూర్వీకులు ఈ వ్యతిరేకతని ఎదుర్కొన్నారు. మా తర్వాత తరాలు కూడా కొన్ని దశాబ్దాలుగా దీనిని భరించాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే గత 24 ఏళ్లలో మొదటిసారిగా మా సొంత ఊర్లో  కటింగ్ షాపులో కూర్చుని కటింగ్  చేయించుకున్నాను. ఇంతకుముందు  ప్రతిసారి వేరే ఉరికి వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజు మా సొంత ఊర్లో  అందరిలో ఒకరిగా ఉన్నట్లు అనిపించింది అని కీర్తి చౌహన్ సంతోషం వ్యక్తం చేశారు.

స్థానిక సామాజిక కార్యకర్త చేతన్ దాభి ఈ సమస్యను పై ముందుకొచ్చారు. పెద్ద కులాలు, కటింగ్ షాపు యజమానులు కుల వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. కొన్నిసార్లు ఈ విషయంలో పోలీసులు, జిల్లా అధికారులు కూడా జోక్యం చేసుకున్నాయి.

ALSO READ : ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్లాన్..

గ్రామ సర్పంచ్ సురేష్ చౌదరి గతంలో జరిగిన వివక్షకు బాధపడుతూ ఈ సమస్యకు పరిష్కారం లభించినందుకు సంతోషంగా  ఉందని,   ఇప్పుడు గ్రామంలోని ఐదు కటింగ్  షాపులు దళితులను అనుమతిస్తున్నాయి అని అన్నారు.  

కీర్తి  చౌహన్ కి హేర్ కటింగ్ చేసిన 21 ఏళ్ల పింటు మాట్లాడుతూ గతంలో కొన్ని  కట్టుబాట్లను పాటించేవాళ్ళం. కానీ ఇప్పుడు పెద్దలు ఈ మార్పును అంగీకరించారు. దీనివల్ల మా వ్యాపారం కూడా బాగుపడుతుందని, అగ్రకులాల వారు కూడా దీనిని సమర్థిస్తున్నారు అని  చెప్పాడు.

 ఓ దళిత రైతు ఈశ్వర్ చౌహాన్ మాట్లాడుతూ ఇప్పుడు కటింగ్ షాపుల్లో మాకు చోటు దక్కింది, కానీ ఇప్పటికీ పెళ్లిళ్లు, ఫంక్షన్లలో విడిగా కూర్చోవాల్సి వస్తోంది. ఆ పరిస్థితి కూడా ఎదో ఒక రోజు మారుతుందని అనుకుంటున్నా అని అన్నారు.