రైతుల ఆందోళనతో టోల్ గేట్లకు రూ.814 కోట్ల నష్టం

రైతుల ఆందోళనతో టోల్ గేట్లకు రూ.814 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు టోల్ గేట్ల ద్వారా రూ.814.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మూడు రాష్ట్రాల పరిధిలోనే ఈ నష్టం వచ్చిందని, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నష్టం రాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో చెప్పారు.  ఈనెల 16వ తేదీ వరకు వచ్చిన నష్టమని ఆయన తెలిపారు. అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో రూ.487 కోట్లు, హర్యానాలో రూ.326 కోట్లు, రాజస్థాన్ లో రూ.140 కోట్ల మేర నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉన్న మార్గాలను పరిశీలించాల్సిందిగా తాము సలహాలిచ్చినట్లు ఆయన తెలిపారు.