
- 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.. పలువురికి గాయాలు
శంషాబాద్, వెలుగు: ఔటర్ రింగు రోడ్డుపై ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నమ్మ హోటల్ వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దాదాపు తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో.. అందులోని పలువురికి గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం కారణంగా ఔటర్ పై దాదాపు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.