మైనర్ బాలికపై 58ఏళ్ల వ్యక్తి అత్యాచారం

మైనర్ బాలికపై 58ఏళ్ల వ్యక్తి అత్యాచారం
  • నిందితుడ్ని అరెస్టు చేసిన ఝార్ఖండ్ పోలీసులు

ఝార్ఖండ్: కుమార్తెను ఇంటి వద్ద వదిలి తల్లిదండ్రులు ఉద్యోగం కోసం ఒకరు.. ఉపాధి కోసం మరొకరు వెళ్లిపోతే ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికపై 58 ఏళ్ల వ్యక్తి కన్నుపడింది. మాయమాటలు చెబుతూ దగ్గరై లైంగిక దాడి చేశాడు. రెండేళ్లుగా వీలు చిక్కినప్పుడల్లా బాలికతో లైంగిక అవసరాలు తీర్చుకుంటున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిమ్‌దేగా జిల్లాలోని ఓ గ్రామంలో 14 ఏళ్ల బాలిక తండ్రి ఉద్యోగ కోసం కేరళకు వెళ్లి నెలా రెండు నెలలకు ఒకసారి సెలవులపై ఇంటికి వచ్చి వెళ్లేవాడు. తల్లి జీవనం గడపడం కోసం గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ  కూతుర్ని పోషించుకుంటోంది. బాలికపై కన్నేసిన పొరిగింటి 58ఏళ్ల వ్యక్తి చనువుగా ప్రవర్తిస్తూ.. లైంగికదాడి చేస్తున్నాడు. ఆలస్యంగా గుర్తించిన తల్లి తన బాలికతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వైద్య పరీక్షలు, చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.