జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్తో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుళ్లు రాజు, వినయ్ లు ఓ కేసు దర్యాప్తు కోసం బస్తీకి వెళ్లాడు. అక్కడ ఏమైందో ఏమో కానీ గుర్తు తెలియని ఓ వ్యక్తి తల్వార్తో వారిపై దాడి చేశాడు.
రాజు అనే కానిస్టేబుల్ను దుండగుడు ఛాతీలో పొడవగా, వినయ్ కు తలపై గాయాలయ్యాయి. తీవ్రగాయాల పాలైన వీరిని వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.