
ఫరీదాబాద్ సిటీలోని ఓ 18 అంతస్తుల బిల్డింగ్ అది.. పదో అంతస్తులో ఉంటున్న ఓ తల్లి తన చీర కోసం కొడుకు పాణాలనే రిస్క్‌ల వెట్టింది. కింది ఫ్లాట్‌లో పడ్డ చీరను తీసుకునేందుకు తమ బాల్కనీలో నుంచి ఓ చీరను కిందికి వేలాడదీసింది. దాన్ని పట్టుకుని కిందికి దిగుమని కొడుకును పంపింది. ఆ తర్వాత మళ్లీ అట్లనే పైకి లాగింది. ఈ ప్రాసెస్‌లో పిల్లోడి చెయ్యి జారినా.. చీర చినిగినా పదో అంతస్తు నుంచి ఆ బాబు కిందపడేటోడు. అంతెత్తునుంచి పడితే బతికే ఛాన్సేలేదు. ఈ నెల 6న ఫరీదాబాద్ లోని సెక్టార్ 82లో జరిగింది. అపార్ట్మెంట్ ఎదురు బిల్డింగ్‌లో ఉండేటోళ్లు దీనినంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన్రు. దీంతో వీడియో వైరల్ అయింది. ఐపీఎస్ ఆఫీసర్ దీపాంశు కాబ్రా తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేసి, ఆ తల్లి బాధ్యతలేనితనాన్ని, కేర్లెస్నెస్ను విమర్శించారు. వీడియో చూసినోళ్లంతా ఆ తల్లి నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ఓ చీర కోసం పిల్లోడి పాణాలతో చెలగాటమాడుడేందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆ మహిళకు నోటీసులిచ్చిందట.