ఆధార్-రేషన్ కార్డ్ లింకింగ్: గడువు జూన్ 30కి పొడిగింపు

ఆధార్-రేషన్ కార్డ్ లింకింగ్: గడువు జూన్ 30కి పొడిగింపు

ఆహార, ప్రజాపంపిణీ శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం రేషన్‌కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు గడువును మార్చి 31, 2023 నుంచి జూన్ 30, 2023 వరకు కేంద్రం పొడిగించింది. బహుళ రేషన్ కార్డులను పొందకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఆధార్-రేషన్ కార్డును ఆఫ్‌లైన్‌లో ఎలా లింక్ చేయాలంటే..

  •     కుటుంబ సభ్యులతో సహా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఫొటోకాపీలను తీసుకెళ్లండి .
  •     కుటుంబ పెద్ద పాస్‌పోర్ట్ సైజు ఫొటోను తీసుకుని, దానిని PDS లేదా రేషన్ దుకాణంలో సమర్పించండి.
  •     ఆధార్ డేటాబేస్‌కు వ్యతిరేకంగా ధృవీకరించబడే సమాచారం కోసం మీరు వేలిముద్ర వివరాలను అందించాల్సి ఉంటుంది.

సంబంధిత అధికారులు పత్రాలను ప్రాసెస్ చేస్తారు. రేషన్ కార్డు లింక్ చేసిన తర్వాత మీకు తెలియజేస్తారు.

అవసరమైన పత్రాలు:

  •     రేషన్ కార్డు ఫొటోకాపీ
  •     కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డుల ఫొటోకాపీలు
  •     బ్యాంక్ పాస్ బుక్ కాపీ
  •     కుటుంబ పెద్ద పాస్‌పోర్ట్- సైజ్ ఫోటోలు

 ఆన్‌లైన్‌లో ఆధార్-రేషన్ కార్డ్ ఎలా లింక్ చేయాలంటే..

  •     మీ రాష్ట్రంలోని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ చేయండి.
  •     మీ రేషన్ కార్డ్‌కి మీ ఆధార్‌ను కనెక్ట్ చేసే ఆప్షన్ ను ఎంచుకోండి .
  •     మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేయండి.
  •     సబ్మిట్ బటన్ నొక్కండి
  •     OTP ధృవీకరణ తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు రసీదు పంపబడుతుంది.