పాపన్నపేట, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని పాపన్నపేటలో సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రూ.8500 కోట్ల స్కాలర్షిప్బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేశారు. ప్రభుత్వానికి వైన్స్ టెండర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదన్నారు.
బకాయిలు విడుదల చేయకుంటే కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో ఎక్కడ తిరగనివ్వమని హెచ్చరించారు. స్కాలర్షిప్ ప్రభుత్వ భిక్ష కాదు విద్యార్థుల హక్కు అన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంతోష్, వినయ్, విక్రం, వంశీ, నిఖిల్, ఆదిలక్ష్మి, అశ్విని, సుజాత, శివ, విఘ్నేశ్వర్, ప్రవీణ్, చరణ్ పాల్గొన్నారు.
జహీరాబాద్: స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్స్వెంటనే చెల్లించాలని డిమాండ్చేస్తూ సోమవారం వివిధ కాలేజీల విద్యార్థులు జహీరాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళను చేశారు. అనంతరం ఆర్డీవో ఆఫీసుకు ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
