స్కాలర్షిప్లు విడుదల చేయాలి : ఏబీవీపీ నాయకులు

స్కాలర్షిప్లు విడుదల చేయాలి : ఏబీవీపీ నాయకులు
  • ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన

మెదక్​ టౌన్, వెలుగు: ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సివన పెండింగ్​ స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్​మెంట్స్​ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​చేశారు. సోమవారం -రామాయంపేట ప్రధాన రహదారిపై విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు రూ.8,700 కోట్లు బకాయి పడిందని వెంటనే ఆ నిధులను విడుదల చేయాలన్నారు. 

లేదంటే చాలామంది విద్యార్థులు మధ్యలోనే చదువును మానేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఉదయ్​కిరణ్​, వంశీ, తేజ, భాస్కర్, లక్ష్మీ, భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.

దున్నపోతుకు వినతిపత్రం

హుస్నాబాద్: పెండింగ్​ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్స్​విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ఆరోపిస్తూ ఏబీవీపీ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు దున్నపోతుకు వినతిపత్రం సమర్పించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్​బకాయిలను విడుదలచేయకుంటే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో విద్యార్థి ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాకేశ్, రాజేశ్, చరణ్, రాజు, రాహుల్, అంజి, రిత్విక్, సంతోష్, సిద్దు పాల్గొన్నారు.

డిగ్రీ కాలేజ్ సమస్యలను తీర్చాలని రాస్తారోకో

రామాయంపేట: రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వం డిగ్రీ కాలేజీలో నెలకొన్న సమస్యలను తీర్చాలని డిమాండ్ చేస్తూ  ఏబీవీపీ ఆధ్వర్యం లో స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద పాత హైవే పై బైఠాయించి రాస్తారోకో చేశారు. డిగ్రీ కాలేజ్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కాలేజ్ ఏర్పడి 3 ఏళ్లవుతుందని, 150 మంది స్టూడెంట్స్ ఉండగా  అందులో 50 మంది గర్ల్స్ ఉన్నారన్నారు. వీరందరికీ ఒకే టాయిలెట్ ఉందని, స్టూడెంట్స్ కు సరిపడా గదులు లేవన్నారు. కాలేజ్ లో నెలకొన్న సమస్యలు అన్నీ తీర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అర్జున్, ఆదర్శ్ , దీక్షిత్, శివకిరణ్, భరత్, ప్రశాంత్ పాల్గొన్నారు.