
వైరా, వెలుగు: కొణిజర్ల మండలంలోని అమ్మపాలెం పరిధిలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేశ్నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం శనివారం తనిఖీలు నిర్వహించింది. స్కూల్లోని మౌలిక సదుపాయాలను, ఆహార నాణ్యతను టీమ్ సభ్యులు పరిశీలించారు. మెనూ, విద్యా బోధన తదితర అంశాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.