
పంజాగుట్ట, వెలుగు: సినీ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశాన వాటికలో సోమవారం పూర్తయ్యాయి. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి నుంచి అంతమ యాత్ర ప్రారంభమైంది. అంతకుముందు నటుడు వెంకటేశ్, రాజశేఖర్, జీవిత, నిర్మాత ఆదిశేషగిరి రావు, మాదాల రవి పలువురు సినీ ప్రముఖులు చంద్రమోహన్ భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన సోదరుడు మల్లంపల్లి దుర్గా ప్రసాద్ చేతుల మీదుగా అంత్యక్రియ లు జరిగాయి. అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం చంద్రమోహన్ మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె మధుర మీనాక్షి ఇండియాకు రావడానికి ఆలస్యం కావడంతో అంత్య క్రియలు సోమవారం నిర్వహించారు. చంద్ర మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా, ఒకరు అమెరికాలో సైకాలజిస్టుగా, మరొకరు చెన్నైలో సెటిలయ్యారు.