
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఫాసిజానికి, సామ్రాజ్యవాద ధోరణులకు వ్యతిరేకంగా శ్రామికవర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సభలు, సెమినార్లు నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని గురువారం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలో ఈ నెల 9న నిర్వహించనున్న సభలు, సెమినార్లను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులు, పాలకవర్గాలు హిట్లర్ నాజీయిజాన్ని పొంచి పోషించాయని చెప్పారు. దేశంలో ఫాసిస్టు ధోరణులకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాన్ని, ప్రజలను చైతన్యం చేస్తూ పోరాటాలు చేయనున్నట్టు తెలిపారు.