
భారత స్టార్ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. రోహిత్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించటం అందరినీ షాక్ కి గురి చేసింది. తమ ఫేవరెట్ ప్లేయర్ రిటైర్మెంట్ ను జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రోహిత్ రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ఒక మాస్టర్, లీడర్, జెమ్ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు గంభీర్. రోహిత్ రిటైర్మెంట్ పై గంభీర్ చేసిన వన్ లైన్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ రిటైర్మెంట్ ప్రకటనతో.. ఫామ్ లో లేని సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు రోహిత్. గంభీర్, రోహిత్ లు కలిసి కొంతకాలం డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న సంగతు తెలిసిందే. ఈ ఇద్దరు 2007 టీ20 వరల్డ్ గప్ గెలిచిన జట్టులో కూడా ఉన్నారు. రోహిత్ శర్మ ఇంస్టాగ్రామ్ ద్వారా తన రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే గంభీర్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..పరేషాన్ లో ఐపీఎల్.!
A master, a leader & a gem! #RohitSharma pic.twitter.com/C6RgU6P18n
— Gautam Gambhir (@GautamGambhir) May 7, 2025
ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని తెలిపాడు. బుధవారం ( మే 7 ) రాత్రి ఇన్‌స్టా స్టోరీ ద్వారా ఈ విషయం వెల్లడించాడు. ‘ హలో ఆల్... నేను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయం మీతో పంచుకుంటున్నా. వైట్ జెర్సీలో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఇన్నేండ్లపాటు మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు థ్యాంక్స్. వన్డే ఫార్మాట్‌లో ఇండియాకు ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తా’ అని పేర్కొన్నాడు రోహిత్. 280 నంబర్‌తో కూడిన తన టెస్టు క్యాప్ ఫొటోపై ఈ సందేశం ఇచ్చాడు.
తన కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 ఫిఫ్టీలు ఉన్నాయి. 2013లో ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతను గతేడాది మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో గత వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఇండియాను నడిపించిన రోహిత్ 24 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఇండియా 12 మ్యాచ్‌ల్లో నెగ్గి తొమ్మిదింట్లో ఓడింది. మూడు డ్రాగా ముగిశాయి. గతేడాది టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత షార్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న రోహిత్.. ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లోనే ఇండియాకు ఆడనున్నాడు.